మొంథా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్కువ చేసి చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా గూడూరు ఆకుమర్రు లాకుల వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.