పెడన: రైతులకు రూ. 25, 000 నష్టపరిహారం ఇవ్వాలి:

తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి కనీసం రూ. 25,000 పంట నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. శనివారం పెడన నియోజకవర్గంలో పలు గ్రామాలలో పంట పొలాలు పరిశీలించిన ఆమె, గతంలో ప్రభుత్వం కేవలం రూ. 5,000 నుంచి రూ. 6,000 వరకు మాత్రమే చెల్లించిందని, ఆ మొత్తంతో రైతు తన నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్