బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని సువర్చలాసమేత ఆంజనేయస్వామివారిని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సోమవారం రాత్రి దర్శించుకుని పూజలు చేశారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనను ప్రత్యేకంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.