ఉయ్యూరు మండలంలోని కాటూరు గ్రామంలోని శివాలయాల్లో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, అభిషేకాలు నిర్వహించారు. ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.