గంపలగూడెం మండలంలోని పెనుగొలనులో వాసవి యూత్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గ్రామ సెంటర్‌లో అమర్ గివి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.