గంపలగూడెం మండలం మేడూరులోని 1116 శివలింగాల ఆలయ ప్రాంగణంలో మంగళవారం వివిధ స్వాముల మాలాదారులకు, భక్తులకు, అనాధలకు అన్నదానం జరిగింది. ఆలయంలోని శ్రీ గణపతి, శ్రీ కాత్యాయని సమేత జీవన ముక్తేశ్వర స్వామి, సూర్య భగవాన్, ఆంజనేయ స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ అప్పారావు దంపతులు, ఇతరులు భక్తుల సహకారంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు.