110 ఏళ్ల నాటి పురాతన ఇంటి కూల్చివేత: గ్రామస్తుల కన్నీటి వీడ్కోలు

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో 110 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతనమైన ఇంటిని శనివారం పొక్లిన్తో కూల్చివేశారు. అనేకమంది గ్రామస్తులు, నాలుగో తరం వారసులు ఈ చారిత్రాత్మక ఇంటిని చివరిసారిగా చూసి వెళ్లారు. ఈ ఇంట్లో ఎన్నో పంచాయతీలు పరిష్కారమయ్యాయని, ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్