గంపలగూడెం: జిల్లా క్రీడలకు ఎంపికైన బంక శ్రావ్య

తోటమూలకు చెందిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని బంకా శ్రావ్య జిల్లా క్రీడలకు ఎంపికైంది. ఇటీవల విస్సన్నపేట డివిజన్ స్థాయిలో జరిగిన ఎస్.జి.ఎఫ్.ఐ. సెలక్షన్ లో కో కో క్రీడకు ఎంపికైన శ్రావ్య, ఈనెల 5వ తేదీన గుడివాడలో జరగనున్న జిల్లా స్థాయి కో కో క్రీడలో పాల్గొననుంది. ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్