కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వెంకటేశ్వర్లు స్వామి భక్తులతో కలిసి స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేయించి, నూతన వస్త్రాలతో అలంకరించారు. మహిళలు దీపోత్సవం చేసి భగవంతుని నామాన్ని పారాయణం చేశారు. ఆలయ కమిటీ కన్వీనర్ పరుచూరు హరిమధవగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు.