పెనుగొలనులో జాతీయ సమైక్యతా దినోత్సవం: పటేల్‌కు నివాళులు

గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. భారత ప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా అక్టోబర్ 31న జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా పండ్లు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్