బైక్ నడుపుతున్న మైనర్ బాలుడికి "క్లాస్ ఇచ్చిన ఆర్డీఓ మాధురి.

తిరువూరు ఆర్డీఓ మాధురి తోటమూల గ్రామంలో వేగంగా బైక్ నడుపుతున్న బాలుడిని అడ్డుకున్నారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని తహసిల్దార్ ను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు కూడా మైనర్ల వాహన చోదనం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్