గంపలగూడెం మండలం పెనుగొలనులోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో మూడు రోజుల పాటు జరిగిన స్వామివారి జయంతి ఉత్సవాలు సోమవారం రాత్రి మహా హారతితో వైభవంగా ముగిశాయి. భక్తులు శివలింగ ఆకారంలో 108 కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రామిశెట్టి కోటేశ్వరరావు, రంగు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.