తిరువూరు: కోడి పందాలు నిర్వహిస్తున్న 4వ్యక్తులు అరెస్ట్

తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు, 10 కత్తులు, రూ.1200 నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్