విజయవాడలో 27 మందికి జరిమానా

విజయవాడలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి న్యాయస్థానం మంగళవారం భారీ జరిమానా విధించింది. నాలుగో ట్రాఫిక్ పరిధిలో పట్టుబడిన వీరిలో ఐదుగురికి రూ. 15వేల చొప్పున, మిగిలిన 22 మందికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి లెనిన్ బాబు తీర్పునిచ్చారు. మరోసారి ఇలా పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్