కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముల కస్టడీపై నేడు (మంగళవారం) 6వ ఏజేఎంఎఫ్సీ కోర్టులో విచారణ జరుగనుంది. ఆదివారం అరెస్ట్ అయిన వీరిద్దరిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్, ఎక్సైజ్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరి వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించి, తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.