విజయవాడ ఆటోనగర్ లో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆటోనగర్ తో పాటు పటమట పోలీస్ స్టేషన్ రోడ్డు, గురునానక్ కాలనీ రోడ్డు, మహానాడు రోడ్డు, బందర్ రోడ్డు, బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ రోడ్డు, పటమట సెంటర్, పీ అండ్ టీ కాలనీ, ప్రసాదంపాడులో మోకాళ్ల లోతు నీరు చేరింది. షెడ్డుల్లోకి నీరు చేరడంతో కార్మికులు అవస్థలు పడ్డారు. వీఎంసీ సిబ్బంది నీటిని తొలగించగా, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.