విజయవాడ: అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిమ్మల

ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పెరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. సాయంత్రానికి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి 6 నుంచి 6. 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, కృష్ణా డెల్టా పరిధిలోని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్