శనివారం విజయవాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గిరిజన స్వాభిమాన ఉత్సవాలను ప్రారంభించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన గిరిజన యోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. యువత బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గంటం దొరల ఆదర్శాలను అనుసరించాలని, సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూ ఆధునిక సాంకేతికతను స్వీకరించి సామూహిక గిరిజన సాధికారత సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.