ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు 6వ రోజుకి చేరుకున్నాయి. శనివారం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరగటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో అమ్మవారి దేవాలయం వద్ద ఫుల్ ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో కొండపైకి వెళ్లే వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. అక్కడి పోలీసులు ట్రాఫిక్ను అంతరించే పనిలో నిమగ్నం అయ్యారు.