విజయవాడ రూరల్ వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్ నంబూరి మనోజ, ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని బడి తోటలో కూరగాయలు, పండ్లు పండించాలని సూచించారు. పాఠశాల ఆవరణంలో నాచురల్ పద్ధతిలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు పండిస్తున్నామని, చిన్న వయసు నుంచే విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.