పోలీసులపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

ఆదోని పెసలబండలో గణేష్ నిమజ్జనం సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ షేక్ సాబ్ పై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ ఖండించారు. మంగళవారం ఆసుపత్రిలో కానిస్టేబుల్ ను పరామర్శించిన వారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మినీ బార్లను ప్రోత్సహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. నాయకులు బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారని, పోలీసులపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్