కోడుమూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

కుటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కోడుమూరు పట్టణంలోని 13వ షాపులో బోయ కృష్ణ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ముఖ్య అతిథులుగా టీడీపీ మండలాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు కప్పట్రాళ్ల మహేష్ నాయుడు, టీడీపీ నేత బలరాం పాల్గొన్నారు. ఈ విధానం పారదర్శక రేషన్ పంపిణీకి నిదర్శనమని, ప్రతి లబ్ధిదారుడికి రేషన్ సౌలభ్యంగా, అవినీతికి తావు లేకుండా అందుతుందని పేర్కొన్నారు. ప్రజలు భారీగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్