మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా.. శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి తెలియజేశారు. పెద్దకడబూరు మండలంలోని తారాపురం, రంగాపురం, చిన్నకడబూరు గ్రామంలో టీడీపీ నేత నరవ రమాకాంతరెడ్డి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని గురించి వివరించారు. ఇందులో టీడీపీ నేతలు గోనుమాను నరసన్న, లక్ష్మన్న, సుక్క నరసన్న ఉన్నారు.