కల్లూరు అర్బన్ 36వ వార్డులోని శ్రీ హరిహర దేవాలయంలో (సున్నం గుడి) జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన చండీహోమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి, భక్తులతో కలిసి దుర్గామాత ఆశీర్వాదం కోరారు. ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.