ఆదోని: వేరుశనగ లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా

ఆదోని పట్టణ పరిధిలోని పర్వతాపురం రోడ్డులో గురువారం వేరుశనగ లోడుతో వెళ్ళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుంతలమయమైన రోడ్డులో ప్రయాణిస్తూ వాహనం అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రోడ్డును త్వరగా మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్