ఆదోని పట్టణంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మృతిపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరపాలని బీజేపీ నాయకులు మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. హనుమాన్ నగర్ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయానికి సంబంధించిన స్థిర, చర ఆస్తులలో అక్రమాలు జరుగుతున్నాయని, మృతి చెందినప్పుడు విలువైన వస్తువులు రాత్రికి రాత్రే మాయం అయ్యాయని వారు ఆరోపించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించాలని వారు కోరారు.