ఆదోని పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే పార్థసారథి తెచ్చిన 7.5 కోట్ల నిధులపై 41వ వార్డు కౌన్సిలర్ ఇందు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ హాల్‌లో మాట్లాడుతూ, 15వ ఫైనాన్స్ కింద 6 కోట్లు, ఫ్లడ్ కింద 1.40 లక్షలు వచ్చాయని, ఇవి సాధారణ నిధులని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే ఈ నిధులను తన సొంత కృషితో తెచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విజ్ఞతకే వదిలేయాలని ఆమె వ్యాఖ్యానించారు.