ఆదోని మండలంలోని దొడ్డనగేరి గ్రామంలో ప్రభుత్వ భూమిపై మొండి ఏసయ్య ఏర్పాటు చేసుకున్న గుడిసెను బాలస్వామి, తిక్కన్న తదితరులు ధ్వంసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై ఏసయ్య పెద్దతుంబళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు. స్థలం తమదని గొడవపడ్డారని బాధితుడు ఆరోపించాడు.