ఆదోనిలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆదోనిలోని రాయనగర్ శివారులో గురువారం రాత్రి ఇసుక టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజరాజేశ్వరి కాలనీలోని మలేకర్ అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయన్ని ప్రైవేట్ అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ కుక్కను తప్పించబోయే క్రమంలో బైకును ఢీ కొట్టినట్లు చెప్పారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత పోస్ట్