ఆదివారం ఆదోని మండలంలోని ఇస్వీ పోలీస్ స్టేషన్ ఎస్సై మహేష్ కుమార్ మాట్లాడుతూ, కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఇస్వీ పోలీసు స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడి మాజీ ఎస్సై డాక్టర్ నాయక్ అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యారని తెలిపారు.