ఆళ్లగడ్డలో బీజేపీ ఇంటింటా స్వదేశీ ఉద్యమం

ఆళ్లగడ్డ పట్టణంలో బీజేపీ నేతలు బుధవారం ఇంటింటా స్వదేశీ ఉద్యమం చేపట్టారు. స్థానిక టీబీ రోడ్డులోని హోల్ సేల్ దుకాణదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్