సిరివెళ్ల: పిడుగులతో వర్షం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

నంద్యాల జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సిరివెళ్ల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో పిడుగు పడటంతో కొబ్బరి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో బయటకు రావద్దని, ముఖ్యంగా చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్