ఇసుకపై వైసీపీ తప్పుడు ప్రచారం: శీలం హరికుమార్ రెడ్డి

ఆళ్లగడ్డలో ఇసుక విక్రయాలపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ మండల కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రభుత్వ జీవో ప్రకారం మాత్రమే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కలిపి విక్రయిస్తున్నామని, అదనపు రుసుములు వసూలు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్