ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, మంగళవారం దేవనకొండలో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల దుస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులను పట్టించుకోవడం లేదని, ఆయన కేవలం ఉత్సవ విగ్రహంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధిక వర్షాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.