కర్నూలు జిల్లా దేవనకొండ మండల సర్వసభ్య సమావేశంలో మంగళవారం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొన్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం, తాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పనుల వేతనాల చెల్లింపు, గ్రామాల్లోనే ఉపాధి కల్పించి వలసలను నివారించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.