ఆలూరు: హంద్రీనీవా కెనాల్ ద్వారా విడుదల

ఆలూరు నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరందించే కార్యక్రమం గురువారం గుంతకల్లు సమీపంలోని తూము నుంచి ప్రారంభమైంది. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ మాట్లాడుతూ చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం, నారాయణ స్వామి, గుమ్మనూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్