హొళగుంద మండల పరిధిలోని దేవర గట్టు మాల మల్లేశ్వర స్వామి సన్నిధిలో నూతన కమిటీ చైర్మన్‌గా వీరనాగప్ప శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలూరు టీడీపీ ఇన్చార్జి వైకుంఠ జ్యోతి నూతన చైర్మన్‌ను అభినందించారు. వీరనాగప్ప మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.