రబీ సాగుకు మార్చి వరకు నీటి విడుదల: రైతుల ఆవేదన

రబీ సీజన్ లో ఆంధ్ర కర్ణాటక రైతన్నలు కొంత సాగుచేసుకోవడానికి ఎల్ ఎల్ సి కి మార్చి నెల వరకు సాగునీరు విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎల్.ఎల్.సి డిస్ట్రిబ్యూటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్, జిల్లా కర్నూల్ కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో తుంగభద్ర దిగువ కాలువ కింద పంట సాగు చేసిన రైతన్నలు అధిక వర్షాలతో పంటలు దిగబడుల రాక నష్టపోయారని, రబీ సీజన్ లో పంటలు సాగు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ లో 80 టీఎంసీల నీరు ఉన్నందున రబీ పంట సాగు కోసం మార్చి నెల వరకు తుంగభద్ర డ్యాం దిగువ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్