మాజీ మంత్రి అరెస్టుపై వైసిపి ఎమ్మెల్యే విరుపాక్షి ఆగ్రహం

ఆలూరు వైసిపి ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. కాశిబుగ్గ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ అరెస్టు జరిగిందని ఆదివారం ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. నకిలీ మద్యం కేసుల్లో నిజమైన నిందితులు టీడీపీ వారేనని, ఇప్పుడు వైయస్సార్సీపిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే విరుపాక్షి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్