ఆదివారం అవుకు పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్‌ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి సందర్శించారు. ప్రస్తుతం వారానికి ఒక్కరోజు మాత్రమే మార్కెట్ తెరిచి ఉందని గుర్తించి, ప్రజల సౌకర్యార్థం ఇకపై ప్రతిరోజూ తెరిచేలా అధికారులను ఆదేశించారు. వ్యాపారులు, ప్రజలకు అనుకూలంగా మార్కెట్ అభివృద్ధికి సూచనలు చేశారు.