కోడుమూరు: మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి – ఈగల్ టీమ్ సూచన

గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత, బాలలతో సహా వివిధ వర్గాల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎలీషా తెలిపారు. సోమవారం కోడుమూరులో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో 'డ్రగ్స్ వద్దు బ్రో' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐజీపీ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు సాయిరాం డిగ్రీ, కేవీఆర్ జూనియర్ కాలేజీల్లో ఎస్సై మణికంఠ, కానిస్టేబుల్ ఎలీషా, పోలీసు సిబ్బంది విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ఎన్డీపీఎస్ చట్టం, పొగాకు ఉత్పత్తుల అమ్మకం నేరమని వివరించారు.

సంబంధిత పోస్ట్