కోడుమూరు: కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే

కోడుమూరు నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు టీడీపీ క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల బీమా సహాయం బుధవారం అందజేయబడింది. కోడుమూరు టీడీపీ మండల కన్వీనర్ రామకృష్ణ రెడ్డి, బలరాంలతో పాటు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జిల్లా కేడీసీసీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి లబ్ధిదారులకు ఈ సహాయాన్ని అందించారు. కార్యకర్తల సంక్షేమం కోసం బీమా పథకాన్ని అమలు చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.

సంబంధిత పోస్ట్