కర్నూలు రూరల్ మండలం మిలిటరి కాలనీ సమీప కరెంట్ సబ్‌స్టేషన్ ఆఫీసులో కరెంట్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, నంద్యాలకు చెందిన దుర్గప్రసాద్ రూ.1,80,000 డబ్బులు తీసుకొని మోసం చేశాడని కర్నూలు మండలం నూతనపల్లెకు చెందిన లక్ష్మీనారాయణ సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని బాధితుడు తెలిపారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.