ప్యాలకుర్తి: రైతుల క్రాప్ రికార్డులు తనిఖీ చేసిన జేసీ

కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో మంగళవారం, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆర్డీవో సందీప్ కుమార్ పంటల నమోదు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎమ్మార్వో, డిప్యూటీ తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్, రైతుసేవా కేంద్ర సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు. రైతులు నమోదు చేసిన పంట వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి, ఎంఎస్పీ మద్దతు ధర ఆధారంగా పంటలు సాగు చేస్తే నష్టాలు తగ్గుతాయని రైతులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్