కోడుమూరు మండలం అనుగొండ గ్రామంలో మురుగునీటి పారుదల విషయంలో తలెత్తిన వివాదం విషాదానికి దారితీసింది. గురువారం ఎస్సై ఎర్రిస్వామి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో మురుగునీటి పారుదల విషయంలో మృతురాలు సుంకులమ్మకు, ఆమె ఇంటి పక్కనే ఉన్న బోయ శంకర్, మిన్నమ్మ, భార్య జయలక్ష్మీల మధ్య గత మూడేళ్లుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. మరోసారి గొడవ జరిగినప్పుడు, అవతలివారు తీవ్ర పదజాలంతో దూషించి అవమానించడంతో మనస్తాపానికి గురైన సుంకులమ్మ గడ్డిమందు తాగి మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.