ఎన్నికల్లో టికెట్ల కోసం డబ్బులు తీసుకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీదీ, టీజీ కుటుంబదీ కాదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కార్పొరేటర్ టికెట్లపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ప్రజల విశ్వాసం గెలిచిన వారికే సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని, డబ్బు కాదు అర్హతే ప్రమాణమని ఆయన అన్నారు.