కోసిగి మండలంలోని సిద్దప్ప పాలెంలో నివాసముంటున్న నిరుపేద వృద్ధురాలు మందుల నరసమ్మ ఇల్లు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో కూలిపోయింది. దీంతో ఆమె నిరాశ్రయురాలయ్యారు. మంగళవారం స్థానికుల సమాచారం మేరకు ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని, గృహ నిర్మాణ పథకం ద్వారా కొత్త ఇల్లు, ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.