కర్నూలు నగరంలోని షరాఫ్ బజార్‌లో 22 తులాల బంగారం తాకట్టు పెట్టి రూ. 10 లక్షలు అప్పుగా ఇచ్చిన నాగేష్, ప్రవీణ్ అనే వ్యక్తులు షాపు మూసి మోసం చేశారని బాధితుడు రమేష్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అశోక్ నగర్‌కు చెందిన రమేష్, తన అప్పును తిరిగి చెల్లించి, తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి వెళ్ళగా, షాపు యజమానులు గత 3 నెలలుగా షాపును మూసివేసి వెళ్లిపోయారని తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.