పెద్దకడబూరు నుంచి మాక్‌ అసెంబ్లీకి విద్యార్థి ఎంపిక

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తరపున వచ్చే నెల 26న జరిగే మాక్‌ అసెంబ్లీకి పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వీరేంద్ర ఎంపికయ్యాడు. గురువారం మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌ విభాగాల్లో విజేతగా నిలిచిన వీరేంద్రను ఎంఈవో రాగన్న, హెచ్‌ఎంలు గోట్ల చంద్రశేఖర్‌, జోజరాజు, లచ్చప్ప తదితరులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్