నంద్యాలలో నవంబర్ 9న ఏఐటీయూసీ జిల్లా సమావేశం

నంద్యాల నేషనల్ పీజీ కళాశాలలో నవంబర్ 9న ఏఐటీయూసీ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అశా, అంగన్వాడి, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శులు ఎస్. మునెప్ప, రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు హాజరవుతారని జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుంకయ్య బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్